top of page
DIY Denim

Make this yours. Add images, text and links, or connect data from your collection.

ఎ.పి. స్టేట్ ఫారెస్ట్ అకాడమీ (రాష్ట్ర అటవీ శిక్షణా సంస్థ) లోగో
APSFA-Logo
వివరణ
  • అడవికి, పర్యావరణానికి చిహ్నంగా మర్రి చెట్టు. పంచభూతాలకు ప్రతీకలుగా ఐదు ఆవరణలుగా ఈ చెట్టు విభజించబడింది.

  • మర్రి చెట్టు పచ్చదనానికి, వనానికి, జీవజాలానికి సంకేతం కాగా చెట్టుపై ఉన్న ఐదు ఆవరణలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలకు ప్రతీకలుగా వివిధ రంగుల్లో చిత్రించబడినాయి

  • దీనికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేఖా చిత్రం. వీటికి పైభాగంలో గగనతలంలో స్వేచ్చగా విహరిస్తున్న పక్షి  చిత్రించారు.

  • మర్రిచెట్టుకు ఇరువైపులా రాష్ట్ర మృగం కృష్ణజింక చిత్రాలు ఉన్నాయి.

  • వృక్ష కాండానికి దిగువన మూలభాగంలో అడవితల్లి చల్లని చూపులను, ఆమె భ్రూ మధ్యంలో జ్ఞాన చిహ్నమైన దీపాన్ని, విద్యకు సంకేతమైన పుస్తకాన్ని చిత్రించారు.

  • చెట్టు యొక్క కాండంపై చిన్ముద్రలో ఉన్న అభయ హస్తాన్ని సంరక్షణకు, ఆశీర్వచనానికి చిహ్నంగా తీర్చిదిద్దారు.

  • కాండంపై గల చిన్ముద్రను చూస్తే వనసంరక్షణ స్ఫురిస్తుంది.

  • అడవితల్లి మనలను ఆశీర్వదిస్తున్న భావన కలుగుతుంది. వన విద్య, వన సంరక్షణపై అవగాహనతో జీవన వికాసం, పురోగతి సాధ్యమని దీపం, పుస్తకం ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఈ లోగోను రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి శ్రీ దాసరి నాగభూషణం గారు రూపొందించారు.

A.P.State Forest Academy,

R.F.R.Complex, Lalacheruvu,

Rajamahendravaram - 533 106

Andhra Pradesh - India

Designed and maintained by A.P.State Forest Academy

Follow us on:
  • Facebook Social Icon
  • Google+ Social Icon
  • YouTube Social  Icon
  • Pinterest Social Icon
  • Instagram Social Icon
© Copyright
bottom of page